ENGLISH | TELUGU  

ఈ సినిమాలో శ‌ర్వాకి ఐదుగురు త‌ల్లులు.. నేను ధోనిలా ఉంటాను

on Feb 21, 2022

 

యంగ్ హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. ఈ మూవీ రాధిక‌, ఊర్వ‌శి, కుష్బూ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 4 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన సీనియ‌ర్ న‌టి రాధిక శ‌ర‌త్‌ కుమార్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు స్టోరీ న‌రేట్ చేస్తున్న‌ప్పుడు మీకు ఎలా అనిపించింది?
డైరెక్ట‌ర్ కిషోర్ ఈ క‌థ న‌రేట్ చేస్తున్న‌ప్పుడే చాలా ఢిప‌రెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఒక హీరో క్యారెక్ట‌ర్‌ను సెంట్రిక్‌గా పెట్టుకుని ఆయ‌న చుట్టూ ఉన్న ఆడ‌వాళ్ల పాత్ర‌ల‌కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ క‌థ రాసుకున్నారు. ఆ పాయంట్ నాకు చాలా యూనిక్‌గా అనిపించింది. క‌థ వింటున్న‌ప్పుడే చాలా హ్యాపీగా త‌ప్ప‌కుండా ఒక ఫీల్‌గుడ్ మూవీ అవుతుంది అనిపించింది. షూటింగ్ అయ్యాక స్క్రీన్ మీద చూస్తున్న‌ప్పుడు కూడా అదే ఫీలింగ్ క‌లిగింది.

మీ పాత్ర గురించి చెప్పండి?
ఈ సినిమాలో నేను శ‌ర్వానంద్ త‌ల్లి పాత్ర‌లో క‌నిపిస్తాను. నా పాత్ర గురించి ఎక్కువ చెప్ప‌లేను కాని క్రికెట్ టీమ్ లో ధోనిలా అన్న‌మాట‌. చాలా కామ్‌గా ఉంటాను కాని ఎప్ప‌టిక‌ప్పుడు క‌థ‌ను ముందుకు న‌డిపిస్తుంటాను. నా పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్‌తోనే ఎలా ఉండ‌బోతుంది అనేది ఆడియ‌న్స్‌కి తెలుస్తుంది. ఎక్కువ కామెడీ చేయ‌ను. ఒక సెటిల్డ్ ప‌ర్స‌న్‌. ఇంకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే ఈ సినిమాలో శ‌ర్వాకి ఐదుగురు త‌ల్లులు ఉంటారు. ఒక్కో త‌ల్లి ఒక్కో మెంటాలిటీతో ఉంటుంది. వారంద‌రినీ పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే..

ఊర్వ‌శి, కుష్బూతో క‌లిసి న‌టించ‌డం ఎలా అనిపించింది?
ఊర్శ‌శితో ఇప్ప‌టికే చాలా సినిమాల్లో క‌లిసి న‌టించాను. కుష్బుతో కూడా చేశాను కాని మ‌రీ ఎక్కువ సినిమాలు కాదు. మేం అంద‌రం త‌ర‌చుగా క‌లుస్తూనే ఉంటాం. అన్ని విష‌యాలు షేర్ చేసుకుంటాం. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే షూటింగ్ వాతావ‌ర‌ణ‌మే చాలా ప్లజంట్ గా ఉండేది. మా రోజుల్లో క్యారీవ్యాన్ ఉండేది కాదు అంద‌రం ఒక చెట్టుక్రింద కూర్చొని మాట్లాడుకునే వాళ్లం. అంద‌రం క‌లిసే భోజ‌నం చేసే వాళ్లం. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత అలాంటి వాతావ‌ర‌ణం మ‌ళ్లీ క్రియేట్ అయింది. మొద‌టి రోజు నుండి చాలా హ్యాపీగా షూటింగ్ లో పాల్గొనే వాళ్లం. టీమ్ అంతా ఒక యూనిట్‌లా కూర్చుని ప్ర‌తి సీన్ గురించి మాట్లాడుకుంటూ షూటింగ్ చేశాం. చాలా హ్యాపీగా అనిపించింది.

శ‌ర్వానంద్, ర‌ష్మిక గురించి చెప్పండి?
శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న ఇద్ద‌రూ వెరీ వెరీ డెడికేటెడ్‌. అంత యంగ్ ఏజ్‌లోనే ఇంత డెడికేష‌న్‌, ప్రొఫెష‌న‌లిజం చూడ‌డం చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. వారిద్ద‌రికీ మంచి భ‌విష్య‌త్ ఉంది. ఈ చిత్రంలో శర్వా పాత్ర మరియు పెర్ఫార్మన్స్ ప్రేక్షుకులను బాగా ఆకట్టుకుంటాయి

కిషోర్ తిరుమల మేకింగ్ గురించి?
డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమల చాలా డీసెంట్‌.. అండ్ కామ్‌. సెట్లో అంత‌మంది ఆర్టిస్టుల‌ని ఎలా హ్యాండిల్ చేసేవాడో ఇప్ప‌టికీ అర్ధంకావ‌డం లేదు. అది నిజంగా స్పెష‌ల్ టాలెంట్‌. ప్ర‌తి విష‌యాన్ని చాలా కూల్‌గా తీసుకునేవాడు.. ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన ముందుకు తీసుకెళ్లేవారు. అది నిజంగా అభినందించాల్సిన విష‌యం అలాగే నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా చాలా స‌పోర్ట్ చేశారు, ప్రతీ ఫ్రేమ్ ఇంత గ్రాండ్ గా కనిపిస్తుంది అంటే అది ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ యే.

ప్ర‌స్తుతం సినిమా రంగంలో మీరు ఎలాంటి మార్పులు గ‌మ‌నించారు?
అప్ప‌టి ఇప్ప‌టికీ మేకింగ్ ప‌రంగా ఎన్నో చేంజెస్ వ‌చ్చాయి. టెక్నాల‌జీ, నాలెడ్జి అంతా మారిపోయింది. ఎప్ప‌టికైనా మార్పే మ‌న‌ల్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్ర‌స్తుతం నేను కొత్త డైరెక్ట‌ర్స్‌, కొత్త ఆర్టిస్టుల‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నాను. వారు మంచి టాలెంట్‌తో ముందుకు వ‌స్తున్నారు. చాలా హ్యాపీ. అలాగే నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన క్యారెక్ట‌ర్స్ త‌ప్ప‌కుండా చేస్తాను. తెలుగు సినిమాల్లో న‌టించ‌డం నాకు చాలా ఇష్టం.

మార్చి 4 న సినిమా విడుద‌ల‌వుతుంది క‌దా ఆడియ‌న్స్‌కి ఏం చెప్తారు?
ఈ కోవిడ్ త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ కొంత డౌన్ అయిపోయారు. ప్ర‌పంచంలోనే చాలా మార్పులు వ‌చ్చాయి. అవ‌న్ని మ‌ర్చిపోవ‌డానికి ఒక మంచి సినిమా, ఫ్యామిలీ అంతా క‌ల‌సి హ్యాపీగా చూసే సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. అన్ని స‌మ‌స్య‌ల‌ను మ‌ర్చిపోయి హ్యాపీగా న‌వ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ప్ర‌తి ఒక్క ఫ్యామిలీ త‌ప్ప‌కుండా వెళ్లి సినిమా చూడండి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.