మహేశ్ కి బాబాయ్ - పిన్నిగా మోహన్ లాల్, శోభన!?
on Feb 21, 2022

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం `సర్కారు వారి పాట` వేసవి కానుకగా మే 12న విడుదలకు సిద్ధమైంది. ఈ లోపే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు మహేశ్. `అతడు` (2005), `ఖలేజా` (2010) వంటి క్లాసిక్స్ తరువాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రమిది. ఇందులో మహేశ్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే దర్శనమివ్వనుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే, ఇందులో మహేశ్ బాబుకి తల్లిగా సీనియర్ యాక్ట్రస్ రాధ నటించబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, అభినేత్రి శోభన కూడా ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపిస్తారట. మహేశ్ కి బాబాయ్, పిన్నిగా వారి పాత్రలు ఉంటాయని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, మోహన్ లాల్ ఇప్పటికే `గాండీవం` (స్పెషల్ సాంగ్), `మనమంతా`, `జనతా గ్యారేజ్` వంటి తెలుగు చిత్రాల్లో సందడి చేశారు. ఇక శోభన విషయానికి వస్తే.. `గేమ్` (2006) తరువాత టాలీవుడ్ కి దూరమయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



