`ఆర్ ఆర్ ఆర్ ` ఫస్ట్ లుక్ ఎప్పుడంటే??
on Aug 24, 2019
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తోన్న మహా ముల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్ `. ప్రెజెంట్ ఈ చిత్ర యూనిట్ బల్గెరియా లో ఉంది. అక్కడే నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. ఇక ఈ షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ పైనే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధిచిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే... `ఆర్ ఆర్ ఆర్ `మూవీ ఫస్ట్ లుక్ అక్టోబర్ 22 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అదే రోజు న చేయడానికి కారణం... ఆ రోజు కొమరం భీం పుట్టిన రోజు అట. అందుకే కొమరంభీం గా నటిస్తోన్న ఎన్టీఆర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. అజయ్ దేవ్ గణ్ , సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.