సినిమా టికెట్ రేట్లపై ఆర్జీవీ 'తగ్గేదేలే'!
on Jan 11, 2022

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల విషయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తగ్గేదేలే అంటున్నారు. 'దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధర రూ.2200 అమ్మేందుకు మహారాష్ట్రలో అనుమతి ఇచ్చారు. కానీ.. రాజమౌళి సొంత రాష్ట్రం ఏపీలో మాత్రం టికెట్లను 2 వందలకు విక్రయించడానికి కూడా అనుమతి లేదు. ఇది కట్టప్పను ఎవరు చంపారు? అనే ప్రశ్నలా ఉంది' అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ థియేటర్లతో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్లను రూ.2200 లకు విక్రయిస్తున్నారు అని రామ్ గోపాల్ వర్మ ట్విటర్ లో పేర్కొన్నారు.
ఏపీలో సినిమా టికెట్ ధరల విషయమై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని- ఆర్జీవీ మధ్య ఇటీవల ట్వీట్ల యుద్ధమే జరిగింది. ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని ఆర్జీవీ సోమవారం కలిసి చర్చలు జరిపారు. అయితే.. టికెట్ రేట్ల విషయంలో ఇద్దరి మధ్యా తగ్గేదేలే అన్నట్లుగా చర్చలు జరిగినట్లు అనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. టికెట్ ధరల తగ్గింపుపై మంత్రి- ఆర్జీవీ మధ్య చర్చల్లో ఎలాంటి పరిష్కారమూ లభించలేదు. వివాదమూ ముగిసిపోలేదు. సినిమా టికెట్ ధరలపై నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతలకే ఉంటుందని రామ్ గోపాల్ వర్మ పునరుద్ఘాటించారు. టికెట్ ధరల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని వర్మ స్పష్టంగా చెప్పారు. సినిమా నిర్మాతలపై ఒత్తిడి పెట్టి తక్కువ ధరకు టికెట్లు విక్రయించేలా చేయడాన్ని ఒప్పుకోనని కూడా వర్మ తెగేసి చెప్పారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ మళ్లీ తాజాగా సినిమా టికెట్ ధరలపై ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



