అఫీషియల్.. రవితేజ 'రావణాసుర'లో రామ్ గా యంగ్ హీరో!
on Jan 11, 2022

మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా 'రావణాసుర'. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
'కాళిదాసు' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సుశాంత్.. 'కరెంట్', 'చిలసౌ' వంటి సినిమాలతో అలరించాడు. 2020 లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో' లో కీలక పాత్రలో నటించి మెప్పించిన సుశాంత్.. ఇప్పుడు రవితేజ 'రావణాసుర' సినిమాలోనూ ఓ కీ రోల్ నటించడానికి సిద్ధమయ్యాడు. 'రావణాసుర' మూవీలో రామ్ అనే పాత్రలో సుశాంత్ నటిస్తున్నట్లు తెలియజేస్తూ తాజాగా మూవీ టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో లాంగ్ హెయిర్ తో ఉన్న సుశాంత్ లుక్ ఆకట్టుకుంటోంది.
'రావణాసుర' మూవీలో రామ్ గా సుశాంత్, రావణాసురగా రవితేజ మధ్య పోరు రామ-రావణ యుద్ధాన్ని తలపిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



