సమంత అసలు రంగు బయటపడిందా??
on Oct 1, 2015
సమంత ఇంటిపై ఐటీ అధికారుల దాడి.. షాక్‌కి గురిచేయలేదు. తెలుగు, తమిళ నాట సమంత టాప్ లీడ్‌లో ఉన్న హీరోయిన్. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకొంటున్న కథానాయిక. సో.. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టి సమంత లాంటి కథానాయికలపై పడడం ఆశ్చర్యపరిచే విషయం కాదు. అయితే.. సమంత ఇంట్లో దొరికిన కీలక పత్రాలు, సమంత మేనేజర్ దగ్గర దొరికిన డాక్యుమెంట్లు ఐటీ అధికారులకు షాక్‌ని గురి చేశాయని సమాచారం.
సమంత కొన్ని వెంచెర్లలో భారీగా పెట్టుబడి పెట్టిందని, అందుకు సంబంధించిన ఆధారాలు ఐటీ వాళ్ల దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. సమంత ఛారిటీ పేరుతో కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాంతో పాటు పన్ను కూడా సజావుగానే కడుతోంది. అయితే.. సమంత గుట్టుగా చేస్తున్న 'వ్యాపారాల' తాలుకూ లావాదేవీల సంగతి.. ఐటీ వాళ్ల చేతికి చిక్కిందని టాక్. నిన్నా మొన్నటి వరకూ 'వ్యాపారాలు చేసేంత సొమ్ము నా దగ్గర లేదు..' అంటూ బుకాయించిన సమంత అసలు రంగు ఈ ఐటీ దాడితో బయటపడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
దానికి తోడు మరో షాకిచ్చే విషయం ఏమిటంటే.. సమంత తన ఇంట్లో వాళ్లతో సరిగ్గా ఉండడం లేదట. అమ్మానాన్నల దగ్గర కాకుండా వేరేగా ఉంటోందని టాక్. తాను ఇంటికి వెళ్లి చాలా రోజులైందని టాక్. తల్లిదండ్రులతో సమంత సంబంధాలు బెడసి కొట్టాయన్న విషయం ఐటీ అధికారులకు సమంత తండ్రి జోసఫ్ ఇచ్చిన సమాధానాల బట్టి అర్థమైందని వినికిడి. మరి వీటిపై సమంత ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.