మాట నిలబెట్టుకున్న SKN.. డిప్యూటీ సీఎం గారి తాలూకానా మజాకా!
on Jul 11, 2024
టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్‌కెఎన్ (SKN) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మరియమ్మ కుటుంబానికి ఆటో కొనిచ్చారు. పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలిస్తే.. నా భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తాను అని ఎన్నికల సమయంలో మరియమ్మ చెప్పారు. ఆ వీడియో వైరల్ గా మారి ఎస్‌కెఎన్ వరకు చేరింది. "కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, ఆమె భర్త కోసం నేను ఆటో బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను" అని ఆ టైంలో ఎస్‌కెఎన్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు .
ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో.. తమ మాటను నిలబెట్టుకున్నారు ఎస్‌కెఎన్. "మరియమ్మ గారి కుటుంబానికి ఆటోను బహుమతిగా ఇచ్చాను. వారి మనవడు దానిని నడిపి వారి కుటుంబాన్ని చూసుకుంటాడు. వారి కళ్ళలో ఆనందం చూసి చాలా సంతోషంగా ఉంది." అంటూ ఎస్‌కెఎన్ తన సంతోషాన్ని పంచుకున్నారు.