రాజ్ తరుణ్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి
on Jul 11, 2024
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్ తరుణ్(raj tarun)లావణ్య (lavanya)విషయం హాట్ టాపిక్ అయ్యింది. రాజ్ తరుణ్ నేను పది సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. 2014 లోనే మా ఇద్దరకీ పెళ్లి అయ్యింది.రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడని లావణ్య ఆరోపించింది. అందుకు తగ్గ ఆదారాలని కూడా పోలీసులకి చూపించింది. దీంతో రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు అయ్యింది. కాగా ఈ తంతంగం మొత్తం మీద ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి(karate kalyani)తన ప్రతి స్పందనని తెలియచేసింది.
రాజ్ తరుణ్,లావణ్య లకి సంబంధించిన విషయం పూర్తిగా వాళ్ళిద్దరి వ్యక్తి గతం. సినిమా పరిశ్రమకి ఎలాంటి సంబంధం లేదు. అసలు సమాజానికి కూడా సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఒక వేళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి లావణ్య వచ్చి ఫిర్యాదు చేసినా కూడా అది మీ పర్సనల్ విషయం అని మా అధ్యక్షుడు అంటాడు.ఒక వేళ నిర్ణయం తీసుకున్నా కూడా అది అధ్యక్షుడు ఇష్టం. ఇక కేసు విషయానికి వస్తే లావణ్య ఇప్పటికీ రాజ్ తరుణ్ ని కోరుకుంటుంది.కానీ రాజ్ తరుణ్ అందుకు సమ్మతంగా లేడని అనిపిస్తుంది. అందుకే కేసు వాపసు చేసుకోవాలనుకుంటే డబ్బు డిమాండ్ చేసిందని చెప్తున్నారు. అదంతా పచ్చి అబద్దం.ఒక వేళ నిజంగా అడిగి ఉంటే ఈ పాటికి వాటి తాలూకు ఆధారాలన్నీ బయటపెట్టే వాళ్ళు.
ఇక తినడానికి ఇరవై వేలు ఇవ్వమని అడుగుతుందంటే తను ఏ పరిస్థితుల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.పైగా రాజ్ తరుణ్ అమ్మ నాన్నకి వీరి విషయం తెలుసు. పైగా పదేళ్ల నుంచి అందరు కలిసే ఉంటున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళు స్పందించడం లేదు. అంటే లావణ్య చెప్పే విషయాలన్నీ నిజమే అని అనుకోవాలి. అలాగే చట్టాల్లో కూడా మార్పు రావాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదైనా నేరం చేసి చట్టాల్లో ఉన్న లొసుగులని ఆసరాగా చేసుకొని చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు.వాళ్లలో భయం కలగాలంటే చట్టాలు కఠినంగా ఉండాలని చెప్పింది.
Also Read