ఫహాద్ ఫాజిల్ 'ధూమం' మూవీ రివ్యూ
on Jul 11, 2024
సినిమా పేరు : ధూమం
నటీనటులు : ఫహద్ ఫాజిల్, అపర్ణ బాలమురళి, రోషన్ మాథ్యూ తదితరులు
ఎడిటింగ్: సురేశ్ ఆర్ముగం
మ్యూజిక్: పూర్ణచంద్ర తేజస్వి
సినిమాటోగ్రఫీ: ప్రీత జయరామ్
నిర్మాతలు: విజయ్ కిరగందుర్
రచన, దర్శకత్వం: పవన్ కుమార్
ఓటీటీ : ఆహా
కథ :
అవినాశ్ (ఫహాద్ ఫాజిల్) ఒక సిగరెట్ కంపెనీలో సేల్స్ డిపార్టుమెంట్ హెడ్ గా పనిచేస్తుంటాడు. అతని బాస్ సిద్ధార్థ్ ( రోషన్ మాథ్యూ ). తన సంస్థకి అవినాశ్ తెలివి తేటలు బాగా ఉపయోగపడతాయని భావించి బాగా చూసుకుంటాడు. బిజినెస్ కి సంబంధించిన ప్రతి డీల్ కూడా అవినాశ్ సమక్షంలోనే చేస్తుంటాడు. ఇది సిద్ధార్థ్ బాబాయ్ ప్రవీణ్ (వినీత్)కి నచ్చదు. ఆ సంస్థలో అతను కూడా ఒక భాగస్వామి కావడంతో అవినాశ్ మీద కోపంగా ఉంటాడు. ఇక ఆ ప్రాంతానికి చెందిన మినిస్టర్ (జోయ్ మాథ్యూ), సిగరెట్ బిజినెస్ విషయంలో తనతో చేతులు కలపమని సిద్ధార్థ్ ను కోరతాడు. చిన్న పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే ఆ డీల్ పట్ల అవినాశ్ అభ్యంతరం చెప్తాడు. సిద్ధార్థ్ తో తమ డీల్ కి అవినాశ్ అడ్డుగా ఉన్నాడని మినిస్టర్ గ్యాంగ్ అనుకుంటుంది. అదే సమయంలో అవినాశ్ తన జాబ్ కి రిజైన్ చేయాలనుకుంటాడు. అదే విషయాన్ని ఒక రోజున సిద్ధార్థ్ తో చెప్పగా అతను ఒప్పుకోడు. ఒక రోజు అవినాశ్ తన భార్య దియాతో కలిసి కార్లో వెళుతుండగా.. ఊహించని విధంగా వాళ్లపై దాడి జరుగుతుంది. ఇద్దరూ స్పృహలోకి వచ్చేసరికి ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఉంటారు. అప్పుడు అవినాశ్ కి ఒక కాల్ వస్తుంది. దియా బాడీలో మైక్రో బాంబ్ ను ఫిక్స్ చేయడం జరిగిందని తను చెప్పినట్టుగా చేయకపోతే ఆ బాంబ్ ను పేల్చేస్తామని ఆ వ్యక్తి బెదిరిస్తాడు. దాంతో అవినాశ్ కంగారుపడిపోయి వాళ్ళు చెప్తింది చేస్తుంటాడు. అసలు అవినాశ్ దంపతులపై దాడి చేసిందెవరు? దియా బాడీలో మైక్రో బాంబ్ సెట్ చేసిందెవరు? సిద్ధార్థ్ ను అంతం చేయాలనుకోవడానికి కారణమేంటి? ఈ సమస్య నుంచి బయటపడటానికి అవినాశ్ దంపతులు ఏం చేశారనేది మిగతా కథ.
విశ్లేషణ:
సినిమా మొదలవ్వడమే ఒక ఇంటెన్స్ గా సాగుతూ థ్రిల్ ని పంచుతుంది. భార్యాభర్తలని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేయడం, బాంబ్ ఫిక్స్ చేయడం వంటి సన్నివేశాలతో మొదలై.. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటి ప్రేక్షకుడిలో కలిగిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం అలా ఎంగేజింగ్ చేస్తూనే ఉంటుంది. ఇక అసలు కథ సెకెంఢాఫ్ లో మొదలవుతుంది. బోరింగ్ ప్రొసీడింగ్స్ ఉంటాయి.
ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సెకండాఫ్ లో నాన్ లీనియర్ సీన్స్ వస్తుంటాయి. అంటే సిచువేషన్ కి సంబంధం ఉండదు. అసలు ఏం జరుగుతుందో ఆడియన్ కి అర్థం కాదు. కానీ థ్రిల్ చేయడానికి మేకర్స్ నానా ప్రయత్నాలు చేశారు. అవేవీ వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి.
సిగరేట్ ని అత్యధికంగా సేల్ చేయడానికి కొన్ని పెద్ద కంపెనీలు చేసే ఎత్తులకి బలైన ఓ దంపతులు ఏం చేశారనేది చూపించడం బాగుంది. కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అవ్వలేదు. ధుమపానం వల్ల కలిగే నష్టాలని చూపించడానికి దర్శకుడు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు.
క్లైమాక్స్ అస్సలు ఊహించలేని విధంగా ఉంది. ఇక సీక్వెల్ ఉందనే హింట్ ఇస్తూ ఈ సినిమాను ముగించారు. థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చొచ్చు. ప్రీత జయరామ్ ఫొటోగ్రఫీ బాగుంది. పూర్ణచంద్ర తేజస్వి నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సురేశ్ ఆర్ముగం ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
అవినాష్ గా ఫహద్ ఫాజిల్, దియాగా అపర్ణ బాలమురళి, సిధ్ గా రోషన్ మాథ్యూ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా..
థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
రేటింగ్: 2.5/5
✍️. దాసరి మల్లేష్
Also Read