'ఆర్ఆర్ఆర్' ముందు 'పుష్ప' నిలబడలేదా.. నిర్మాత మాటలకు అర్థమేంటి?
on Dec 28, 2021

జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్' సినిమా లేకపోతే 'పుష్ప'కి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని పుష్ప నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అన్నారు. డిసెంబర్ 17 న విడుదలైన 'పుష్ప ది రైజ్' భారీ కలెక్షన్స్ తో సక్సెస్ దిశగా పరుగులు తీస్తున్న నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పుష్ప సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన అన్ని భాషల ప్రేక్షకులను నిర్మాత నవీన్ ధన్యవాదాలు తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ని పాన్ ఇండియా బ్యానర్ ని చేసిన అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి థాంక్యూ సో మచ్ అన్నారు. పుష్ప మూవీ ఇప్పటిదాకా రూ.275 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అన్నారు. మా అంచనా ప్రకారం జనవరి 6 నాటికి 325 నుంచి 350 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. పుష్ప జనవరి 6 వరకే ఉండబోతుందని, 7 న 'ఆర్ఆర్ఆర్' వస్తుందని, లేదంటే పండగ వరకు పుష్ప ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసేదని నవీన్ చెప్పుకొచ్చారు.
ప్రొడ్యూసర్ నవీన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 'ఆర్ఆర్ఆర్' వస్తే థియేటర్స్ అన్నీ ఆ సినిమాకి వెళ్తాయన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారా? లేక ఆర్ఆర్ఆర్ క్రేజ్ ముందు మిగతా సినిమాలు నిలబడలేవన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



