విలన్‌గా నాని!!
on Feb 20, 2019
మూడేళ్ల క్రితం వచ్చిన `జెంటిల్ మేన్` లో నెగిటివ్ పాత్రలో నటించి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. త్వరలో ఫుల్ ప్లజ్డ్ విలన్ గా కనిపించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన `అష్టాచమ్మా` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని ...ఆ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా షార్ట్ టైమ్ లో ఎదిగాడు. ప్రస్తుతం విభిన్నమైన క్యారక్టర్స్ ఎంచుకుంటూ సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం `జెర్సీ` సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మధ్య వయసు క్రికెటర్ గా కనిపంచనున్నాడు నాచురల్ స్టార్. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఇటీవల ప్రారంభమైన విక్రమ్ కె కుమార్ చిత్రంలో క్రైమ్ స్టోరి రైటర్ గా కనిపించనున్నాడట. ఇందులో మొత్తం అయిదుగురు హీరోయిన్స్ తో నటించనున్నాడు నాని.
ఇదొక కొరియన్ సినిమాకు రీమేక్ గా తెలుస్తోంది. ఇక నాని 25 వ చిత్రం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుందని టాక్. `అష్టాచమ్మ` ,జెంటిల్ మన్` తర్వాత వీరిద్దరి కాంబినేషనల్ లో వస్తున్న ఈ మూడో సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజునిర్మించనున్నాడు. ఈ చిత్రంలోనే నాని విలన్ గా నటించనున్నాడని తెలుస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు నటించనుండగా... ప్రతి నాయకుడిగా నాని దర్శమివ్వనున్నాడట. విక్రమ్ కుమార్ సినిమాతో పాటు సమాంతరంగా ఈ చిత్రాన్ని చేయాలని నాని ప్లాన్ చేసుకున్నాడని ఈఏడాది చివరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల కానుందని సమాచారం. డిపరెంట్ రోల్స్ తో ముందుకు సాగుతున్న నాని, ఆయా చిత్రాలతో మంచి విజయాలను అందుకోవాలని ఆశిద్దాం!