మహేశ్ బాటలో ప్రభాస్?
on Oct 6, 2018
మహేశ్‌బాబు బాటలో ప్రభాస్ నడుస్తున్నాడట! అయితే... ఈ వార్త సినిమాలకు సంబంధించినది కాదు లెండి, వ్యాపారానికి సంబంధించినది. మహేశ్ కంటే ముందు, తరవాత తెలుగు హీరోలు చాలామంది నటించడంతో పాటు చిత్రనిర్మాణంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొన్ని ప్రాంత్రాల్లో స్వంతంగా థియేటర్లను కట్టుకున్నారు. అయితే... మహేశ్‌లా భారీ ఎత్తున మల్టీప్లెక్స్ థియేటర్లు, మామూలు థియేటర్లను నిర్మించాలని ఎవరూ అనుకోలేదు. ఆసియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ భాగస్వామిగా మహేశ్ థియేటర్ల వ్యాపారంలోకి రావాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం... ప్రభాస్ కూడా థియేటర్లు నిర్మించాలని, థియేటర్ల వ్యాపారంలోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట.
మొట్ట మొదటి అడుగుగా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ఒక థియేటర్ కట్టాలని సన్నాహాలు చేస్తున్నాడట! యూవీ క్రియేషన్స్ వెనుక ప్రభాస్ అండదండలు ఎంతో వున్నాయి. ప్రభాస్ సన్నిహిత మిత్రుడు, బంధువు ప్రమోద్ ఉప్పలపాటి ఆ నిర్మాణ సంస్థలో భాగస్వామి. యూవీ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ దూసుకు వెళ్తుంది. అయితే ఎందులోనూ ప్రభాస్ జోక్యం వున్నట్టు తెరపై కనిపించలేదు. ఇప్పుడు నేరుగా థియేటర్లను తన పేరు మీద నిర్మించాలని అనుకుంటున్నాడట!!
Also Read