రవితేజ తమ్ముడి కుమారుడికి అవకాశం వస్తే...
on Apr 28, 2020

మాస్ మహారాజ్ రవితేజ కుమారుడు మహాధన్ ముద్దుగా, అందంగా ఉంటాడు. అతడికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఆల్రెడీ 'రాజా ది గ్రేట్' సినిమాలో చిన్నప్పటి రవితేజగా నటించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా మహాధన్ ఎంట్రీ ఇచ్చేశాడు. తనయుడికి అంటే చాలా ఆసక్తి ఉందని రవితేజ రెండు మూడు సందర్భాలలో చెప్పారు. రవితేజ కుమారుడికి మాత్రమే కాదు... అతడి తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజుకి కూడా హీరోగా కావాలనే కోరిక బలంగా ఉంది.
ఎప్పుడు హీరో అవుతానో తెలియదు గానీ... హీరో కావడం పక్కా అని సోషల్ మీడియాలో ప్రేక్షకుల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటప్పుడు మాధవ్ భూపతిరాజు చెప్పాడు. రవితేజ తనకు ఆదర్శమని చెప్పిన అతడు... రవితేజ కాకుండా తెలుగు హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్టమని అన్నాడు. తమిళ హీరోల్లో విజయ్ అంటే ఇష్టం అన్నాడు. పూరి జగన్నాథ్, రాజమౌళి, హరీష్ శంకర్ తనకు ఇష్టమైన దర్శకులు అని తెలిపాడు.
అవకాశం వస్తే రవితేజ సినిమాల్లో 'డాన్ శీను', 'పవర్' రీమేక్ చేస్తానని మాధవ్ భూపతిరాజు అన్నాడు. అయితే... రవితేజను ఎప్పటికీ మ్యాచ్ చేయలేనని స్పష్టం చేశాడు. రవితేజ ఇంట్లో రవి బాజీ అని మాధవ్ భూపతిరాజు పిలుస్తాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



