ప్రెజర్ పెట్టే అమ్మాయి పెళ్ళాంగా వస్తే?
on Aug 27, 2019
ఆరడుగుల ఆజానుబాహుడు... అందగాడు... తెలుగు హీరోల్లో, ఆ మాటకొస్తే ఇండియన్ హీరోల్లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రశ్నలు తప్పడం లేదు. తెలుగు మీడియా కంటే హిందీ మీడియాకు ఫస్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు ప్రభాస్. అక్కడ పెళ్లి, అనుష్క, అఫైర్స్ అంటూ ఏవేవో ప్రశ్నలు అడిగారు. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడమో లేదా ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడమో చేసే వరకూ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడదేమో అని ప్రభాస్ ఆన్సర్ ఇచ్చాడు. లేదంటే అనుష్కను త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పాలన్నాడు. తన పెళ్లి జరిగేటప్పుడు జరుగుతుందని సెలవిచ్చాడు. తనది ప్రేమ వివాహమే అవుతుందని అన్నాడు. తాజాగా తెలుగు మీడియా ముందుకొచ్చిన ప్రభాస్ కు మళ్లీ పెళ్లి ప్రశ్న ఎదురైంది. కాకపోతే కాస్త కొత్తగా. ''సాహో ప్రెజర్ అంతా మీరు తీసుకుంటున్నారు. మీ ప్రెజర్ తీసుకునే అమ్మాయి మీ జీవితంలోకి ఎప్పుడొస్తుంది?" అని. ఇన్ డైరెక్టుగా పెళ్లి ఎప్పుడు? అని అడిగారు. "ప్రెజర్ తీసుకునే అమ్మాయి వస్తుందో? ప్రెజర్ పెట్టే అమ్మాయి వస్తుందో? ఎవరికి తెలుసు?" అని సమాధానం ఇచ్చాడు. 'ప్రెజర్ పెట్టే అమ్మాయి వస్తే? ఈ సందేహంతో పెళ్లిని వాయిదా వేస్తున్నారా?" అని ప్రభాస్ ను అడగ్గా.... "అదేం లేదు. కావాలని పెళ్లిని వాయిదా వేయడం లేదు. అలా జరుగుతుంది" అన్నాడు. అదీ సంగతి.