వేసవిలో విజయ్ సేతుపతి హవా
on Mar 4, 2021

తమిళనాట తిరుగులేని నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఒకవైపు హీరోగానూ.. మరోవైపు విలన్ గానూ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. ప్రేక్షకుల్ని ఫిదా
చేస్తున్నారాయన. తెలుగులోనూ తనదైన ముద్ర వేస్తున్న విజయ్ సేతుపతి.. ఈ ఏడాది వేసవిలో ఏకంగా నాలుగు కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. 2021 సమ్మర్ లో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన `లాభమ్`, `మామణిదన్`, `తుగ్లక్ దర్బార్`, `యాదుమ్ ఊరే యావరుమ్ కేళిర్` చిత్రాలు తమిళనాట విడుదలకు
సిద్ధమయ్యాయి. సేతుపతికి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. తెలుగులోనూ ఈ సినిమాలు అనువాద రూపంలో జనం ముందుకొచ్చే అవకాశం లేకపోలేదు.
కాగా, విజయ్ సేతుపతి కొంత కాలం క్రితం నటించిన తమిళ చిత్రాలు `జుంగా`, `ఒరు నల్ల నాల్ పాతు సోల్రేన్` సినిమాలు.. తెలుగులో `విక్రమార్కుడు`, `ఓ మంచి రోజు చూసి చెప్తా` పేర్లతో మార్చి 5, మార్చి
19న అనువాద రూపంలో పలకరించబోతున్నాయి.
మొత్తమ్మీద.. ఈ వేసవిలో విజయ్ సేతుపతి హవా ఓ స్థాయిలో ఉండబోతుందన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



