ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిన పూజా హెగ్డే
on Dec 1, 2023
సినిమా ప్రపంచం ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఓవర్ నైట్ తో స్టార్ స్టేటస్ ని పొందేవాళ్ళు ఎలా ఉంటారో ఓవర్ నైట్ తో ఆ స్టార్ స్టేటస్ ని కోల్పోయేవాళ్లు ఉంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఒకప్పటి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఎదుర్కొంటుంది.మొన్నమొన్నటి వరకు తెలుగులో ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా అందులో ఖచ్చితంగా పూజానే హీరోయిన్ గా ఉండేది. అంతలా క్రేజ్ తెచ్చుకున్న పూజాకి ఇప్పుడు కాలం కలిసి రావటం లేదు. ఫలితంగా ఆమె చేతిలో కొత్త ప్రాజెక్టు లు ఏమి లేవు. కానీ నాకు ఎందుకు అవకాశాలు రావు ఇప్పుడు చూడండి అవకాశాలు వాటంతట అవే పరుగెత్తుకుంటు వస్తాయి అనే రేంజ్ లో ఉన్న పూజా పిక్ ఒకటి తాజాగా సంచలనం సృష్టిస్తుంది..
సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా ఇనిస్టాగ్రమ్ లో తన న్యూ పిక్ ఒక దాన్నిషేర్ చేసింది. పూజా షేర్ చేసిన పిక్ అది కేవలం పిక్ మాత్రమే కాదు. కుర్రకారు హృదయాలలో సునామిని సృష్టించే పిక్. ఒంటి మీద షర్ట్ మాత్రమే ఉండి తన హెయిర్ మొత్తాన్ని ముందుకు వదిలేసి నాకేం తెలియదు అనేలా అమాయకంగా ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొడుతుంది. పూజా పిక్ కి అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే పూజా ఏదైనా హడావిడిలో పడిపోయి ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందేమో అని అంటున్నారు.
పూజా నుంచి వచ్చిన గత చితాలైన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ ,సర్కస్ ,కిసి కా భాయ్ కిసి జాన్ లాంటి బడా చిత్రాలు ఫెయిల్ అవ్వడంతో ఆమెకి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతుల్లో ఉన్న ఒకే ఒక్క సినిమా గాంజా శంకర్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ,సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో పూజా ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. కాకపోతే చిత్ర బృందం నుంచి అధికార ప్రకటన రావలసి ఉంది.ప్రస్తుతం ఈమె పరిస్థితి ఎలా ఉందంటే విజయ్ దేవరకొండ హీరోగా ప్రారంభం అయిన జనగణమన సినిమాలో మొదట పూజా నే హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా చేసారు. ఆ తర్వాత ఆ మూవీ ఆగిపోయింది. పూజా కి మంచి రోజులు ప్రారంభం అయ్యి మళ్ళీ తాను సినిమాల్లో మెరవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.