విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్ళి పాట!
on Dec 1, 2023
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ వార్తలు నిజమవుతాయో లేదో తెలీదు కానీ, త్వరలోనే వీరిద్దరూ ఓ పెళ్ళి పాటలో మెరవనున్నారని తెలుస్తోంది.
గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. అయితే ఈ సినిమాలో రష్మిక కూడా సందడి చేయనుందట. గీత గోవిందంలో రష్మిక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్ తో ఫ్యామిలీ స్టార్ కోసం ఆమెని రంగంలోకి దించారని సమాచారం. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో వచ్చే ఒక పాటలో విజయ్, మృణాల్ తో కలిసి రష్మిక ఆడి పాడనుందట. ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ కూడా జరగగా, అందుకు సంబంధించిన క్లిప్స్ లీకయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమాలో రష్మిక కేవలం ఆ సాంగ్ లో మాత్రమే కనిపించనుందని సమాచారం.