ఆ హీరోయిన్‌తో పాట పాడిస్తోన్న త్రివిక్రమ్!!
on Jun 14, 2019
అవును `అరవింద సమేత` చిత్రంలో పూజ హెగ్డే తో డబ్బింగ్ చెప్పించిన తివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి పాట పాడించబోతున్నాడని తెలుస్తోంది. ఒకసారి వివరాల్లోకి వెళితే... ప్రజంట్ తివిక్రమ్ శ్రీనివాస్ , అల్లు అర్జున్ తో ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో పూజతో ఒక పాట పాడించడానికి ప్లాన్ చేస్తున్నాడట. తమన్ సంగీతంలో ఇప్పటికే ఈ సాంగ్ కంపోజింగ్ కూడా పూర్తయిందట. త్వరలో రికార్డింగ్ చేయనున్న ఈ పాట సినిమాకు హైలెట్ గా నిలవబోతుందంటూ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పూజ హెగ్డే ఈ సారి అందం, అభినయంతో పాటు తన గానామృతంతో కూడా కుర్ర కారుకు వెర్రెత్తించనుదన్న మాట.