వజ్ర కవచధర గోవింద మూవీ రివ్యూ
on Jun 14, 2019
నటీనటులు: సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి జబర్దస్త్ బ్యాచ్
డైరక్షన్: అరుణ్ పవార్
నిర్మాతలు: నరేంద్ర, జివియన్ రెడ్డి
సంగీతం: బుల్గానియన్
విడుదల తేదీ: జూన్ 14, 2019
కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సప్తగిరి `సప్తగిరి ఎక్స్ ప్రెస్`తో హీరోగా మారాడు. తాజాగా `వజ్రకవచధర గోవింద` సినిమాతో మరోమారు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ పవార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
స్టోరి విషయానికొస్తే....
తన సొంత గ్రామంలో వరుసగా క్యాన్సర్ తో చనిపోతుండటాన్ని తట్టుకోలేక పోతాడు గోవింద( సప్తగిరి). తన ఊరి జనాన్ని సేవ్ చేయాలని చేసే ప్రయత్నంలో లక్ష్మి ప్రసన్న ( అర్చన శాస్త్రి) పన్నిన పన్నాగంలో దారుణంగా మోసపోతాడు. ఆ తర్వాత నిధి రూపంలో మరో అవకాశం వస్తుంది. కానీ నిధి ఇంతలో మాయమవుతుంది. దాన్ని వెతికే క్రమంలో రౌడీలనుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు కనుగొన్నాడా? లేదా? తన ఊరి సమస్యలు ఎలా తీర్చాడు? ఏంటి? అన్నది సినిమా కథాంశం.
విశ్లేషణ:
సినిమా నిండా పాత్రలే ఉన్నప్పటికీ , ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నా కూడా సినిమా ఆసక్తికరంగా సాగలేదు. ఫస్టాఫ్ కథలోకి వెళ్లడానికి నానా పాట్లు పడ్డప్పటికీ, సెకండాఫ్ కి వచ్చేసరికీ పసలేని సన్నివేశాలు కాలయాపన చేసాడు, కామెడీ అక్కడక్కడ పండించడం వల్ల కొంత బోర్ అనేది పోగొడుతుంది. సప్తగిరి కి ఇచ్చిన బిల్డప్ సీన్స్ ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఆయన చేసే ఫైట్స్ ఒక పెద్ద హీరో చేసే రేంజ్ లో ఉండటం వల్ల ఓవర్ అనిపిస్తుంది. కామెడీ మీద కంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా రాసాడు హీరోకి దర్శకుడు పవార్. ఇక రెగ్యులర్ కామెడీ, లాజిక్ లేని సీన్స్ తో సినిమా అంతా గందరగోళం గోవింద గా మారింది. ఎమోషనల్ కంటెంట్ ఉన్నా కానీ దాన్ని సరిగ్గా వాడుకోలేదు. సప్తగిరి ఉన్నాడు కదా అని కామెడీ ఎక్స్ పెక్ట్ చేసి వెళితే...దెబ్బై పోతారు. సప్తగిరి చేసే కాసింత యాక్షన్, మరి కాసింత కామెడీ చూసి కాలక్షేపం చేద్దామనుకునే వాళ్లు సినిమాకు వెళ్లవచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్ః
సినిమాకు సప్తగిరి నటన ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. గతం మరిచిపోయే సీన్స్, వజ్రం కోసం వెతికే సీన్స్ తో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేసాడు. వైభవి జోషి తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఇక కొంచెం లేట్ గా ఎంటర్ అయినా శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతంర బజర్దస్త్ టీమ్ నవ్వించే ప్రయత్నం చేసారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
కథ ఇంట్రస్టింగ్ గానే ఉన్నప్పటికీ, దాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు కొంత విఫలమయ్యాడనే చెప్పాలి. అందులో సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉంటాయి. ఇందులో సంగీతం సినిమాకు తగ్గట్టుగా ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా పర్వాలేదు. ఎడిటింగ్, కెమెరా పనితనం కొన్ని సీన్స్ ల్లో ఓకే అనిపిస్తాయి.
ఫైనల్ గా చెప్పాలంటే... గందరగోళం గోవింద
రేటింగ్: 2/5