నీహారిక కి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే
on Sep 9, 2024
ఉప ముఖ్యమంత్రి హోదాలో, మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్(pawan kalyan)ఎంత బిజీగా ఉన్నాడో అందరకి తెలిసిందే.వరదలు ముంచుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో అందుకు సంబంధించిన కార్యక్రమాలని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాడు. అలాంటి పవన్ ఇప్పుడు నీహారిక కొణిదెల గురించి ట్వీట్ చెయ్యడం నీహారిక అదృష్టం అనే చెప్పాలి.
చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు వరద ప్రాంతాలకి తమకి చేతనైనంత విరాళాలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే నిహారిక(niharika)కూడా తనవంతు సాయాన్నిప్రకటించింది. బుడమేరు ముంపునకు గురైన పది గ్రామాలకి సంబంధించి ఒక్కో గ్రామానికి యాభై వేల చొప్పున మొత్తం ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఇప్పుడు ఈ విషయంలోనే నిహారికను అభినందిస్తూ పవన్ ఒక ట్వీట్ చేసాడు. ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి ఐదు లక్షల విరాళాన్ని ఇచ్చిన నిహారికకు అభినందనలు తెలుపుతున్నాను.
కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇటీవల పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా కమిటీ కుర్రోళ్లు తో నిర్మాతగా విజయం సాధించిన నువ్వు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని కూడా తెలిపాడు.