ఈ కాంత మామూలుది కాదు.. ఇక ప్రత్యర్దులకి చుక్కలే
on Sep 9, 2024
భాగ్యశ్రీ బోర్సే.. మాస్ మహారాజా రవితేజ తో లేటెస్ట్ గా మిస్టర్ బచ్చన్ లో జోడి కట్టి తన అందంతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.మూవీ పరాజయం చెందినప్పటికీ భాగ్యశ్రీ నటనకి మంచి మార్కులు పడ్డాయి.ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది.
ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా కాంత అనే నూతన చిత్రం తెరకెక్కుతుంది .ఇందులో భాగ్యశ్రీ బోర్సే నే హీరోయిన్. దీంతో ఇక భాగ్యశ్రీ ఫ్యూచర్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా స్థానం సంపాదించే అవకాశాలు ఉన్నాయనే ఆశాభావాన్ని సినీ మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దుల్కర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుంది. అలాగే ఇంకో పాన్ ఇండియా ప్రాజక్ట్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ల మూవీ కూడా భాగ్యశ్రీ ఖాతాలో ఉంది.అలాగే ఇంకొన్ని బడా హీరోల సినిమాల ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మిగతా హీరోయిన్లకి చోటు లేకుండా భాగ్యశ్రీ తన హవాని కొనసాగించవచ్చని అంటున్నారు.
ఇక కాంత తాజాగా పూజా కార్యక్రమాన్ని కూడా జరుపుకోగా దుల్కర్, భాగ్యశ్రీ ల పై చిత్రీకరించిన ఫస్ట్ షాట్ కి విక్టరీ హీరో వెంకటేష్ క్లాప్ కొట్టాడు.1950 వ సంవత్సరంలో మద్రాసు నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరక్కుతుండగా నీలా మూవీ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ప్రముఖ హీరో రానా దగ్గుబాటి, దుల్కర్ లు కలిసి నిర్మాణ సారధ్యాన్ని వహిస్తుండగా మహానటి, విరాట పర్వం లాంటి అధ్బతుమైన చిత్రాలకి ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేసిన డాని సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి పని చేస్తుండటం విశేషం.వర్సటైల్ యాక్టర్ సముద్రఖని ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు.
Also Read