పవన్ బర్త్‌డేకి ‘మెగా...’ గిఫ్ట్
on Sep 2, 2017
పవర్ స్టార్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లొకేషన్లో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటనతో కాసేపు అందరూ షాక్ లో ఉండిపోయారు. ఇంతకీ ఏం జరిగింది? అనుకుంటున్నారా? సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. ఆ రోజున కూడా ఆయన షూటింగ్ కి గ్యాప్ ఇవ్వలేదు. స్పీడ్ గా కానిచ్చేస్తున్నాడు. అయితే... ఉన్నట్టుండి పవర్ స్టార్ లొకేషన్లోకి ఇద్దరు వ్యక్తులు ఎంటరయ్యారు. వారే మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ. తమ్ముడు పుట్టిన రోజు సందర్భంగా... అన్నయ్య చిరంజీవి భార్యా సమేతంగా లొకేషన్ కి వచ్చి శుభాకాంక్షలు అందించారు. ఊహించని ఈ సంఘటన అక్కడున్నవాళ్లందరినీ షాక్ కి గురిచేసింది. అన్నా వదినల ఆశీర్వాదాన్ని అందుకొని పవర్ స్టార్ భావోద్వేగానికి లోనయ్యాడు. రీసెంట్ గా అన్నయ్య చిరంజీవి పుట్టిన రోజున కూడా ఇంటికెళ్లి పవన్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనల ద్వారా... మెగా ఫ్యామిలీలో ఎలాంటి పొరపచ్చలూ లేవనీ... వారందరూ కలిసే ఉన్నారనీ మరో సారి తేటతెల్లమైది.