నాన్న లవకుశ గుర్తొచ్చింది! - హరికృష్ణ
on Sep 4, 2017
పుత్రోత్సాహము కొడుకు పుట్టినప్పుడు కలుగదు... ఆ కొడుకు గొప్పతనానని ప్రజులు పొగుడుతుంటే.. అప్పుడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం. ప్రస్తుతం నందమూరి హరికృష్ణ అదే ఆనందంలో ఉన్నారు. సినీరంగంలో దూసుకుపోతున్న తన కొడుకులిద్దరినీ చూసి మురిసిసోతున్నాడు హరికృష్ణ. ఆదివారం ఎన్టీయార్ నటించిన ‘జై లవకుశ’ ఆడియో వేడుకలో హరికృష్ణ మీడియా సాక్షిగా తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. ‘జై లవకుశ’ ఈ టైటిల్ చూస్తుంటే... నా తండ్రి నందమూరి తారక రామారావు గారు నటించిన ‘లవకుశ’ సినిమా గుర్తొస్తుంది. రామలక్ష్మణుల అన్యోన్యతకు అద్దం పట్టిన సినిమా అది. ఇప్పుడు నా బిడ్డలిద్దరూ ‘జై లవకుశ’ అని సినిమా తీసి... అన్యోన్యమైన అన్నదమ్ములు అనిపించుకున్నారు. తండ్రిగా నాకు ఇంతకంటే ఏం కావాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అన్నారు హరికృష్ణ. బాబి దర్శకత్వంలో ఎన్టీయార్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా.. ఈ నెల 21న విడురల కానుంది. రాశీఖన్నా, నివేదితా థామస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.