పాప్ స్టార్ నోట.. పవన్ దండకం!
on Sep 2, 2017
‘పవర్ స్టార్’...ఈ పదం వింటే.. చాలామందికి పూనకాలొచ్చేస్తుంటాయ్. పైగా సెప్టెంబర్ 2 ఆయన పుట్టిన రోజు. ఇక ఊరుకుంటారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రంబోలా. అన్నదానాలు, పాలాభిషేకాలు.. ఎక్కడబడితే అక్కడ బేనర్లు, వినైల్స్.. హంగామా హడావిడీ.. అంతాఇంతా కాదు. ఆయన క్రేజ్ అలాంటిది మరి. పవర్ స్టార్ ని ఆ స్థాయిలో అభిమానించేవారు సినీ పరిశ్రమలో కూడా చాలామంది ఉన్నారండోయ్. ఇప్పుడొస్తున్న చాలామంది హీరోలకు పవర్ స్టారే కదా రోల్ మోడల్. వారి విషయాన్ని పక్కనపెడితే... పాప్ స్టార్ బాబా సైగల్ కూడా పవన్ అభిమానే కావడం విశేషం. పవన్ అంటే బాబా సైగల్ కు ఎంతిష్టమంటే... పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ పాట రాయించి, తానే స్వయంగా ఆలపించి ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ పాట పల్లవి ఇది.
పవనంటేనే పవరూ... ఆ పేరే ఒక హోరూ...
పవనంటేనే పవరూ... ఆ పేరే ఒక హోరూ..
హిమాలయాలకు ధీటుగా... తానే తనకు సాటిగా...
వన్ అండ్ ఓన్లీ... వన్ ది పవర్ మేన్...
పవ పవ వన్.. పవ పవన్ కల్యాణ్...
పవ పవ వన్... పవ పవన్ కల్యాణ్...
హేపీ బర్త్ డే పవర్ స్టార్...