బన్నీ కాస్త జాగ్రత్త... తమ్ముడికి లైవ్ లో వార్నింగ్...!
on Aug 11, 2016

సినిమా విడుదలకు, ముందు టీవీ ఛానళ్లలో లైవ్ పోగ్రాంలతో హడలగొట్టేస్తుంటారు సినిమా వాళ్లు. ఈ లైవ్ పోగ్రాంల వల్ల ఎంత లాభమో.. అంత నష్టం కూడా. వీక్షకులు ఫోన్లు చేసి అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులో కొన్ని తింగర ప్రశ్నలుంటాయి.. ఇంకొన్ని తిక్క ప్రశ్నలూ ఉంటాయి. అవన్నీ ఓర్చుకొంటూ నేర్పుగా సమాధానం చెప్పాలి. ఇంకొన్ని ప్రశ్నలైతే వినగానే దిమ్మతిరిగిపోతుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. అలాంటి అయోమయ స్థితి అల్లు శిరీష్‌కీ ఎదురైంది. శ్రీరస్తు - శుభమస్తు యావరేజ్ గా నడుస్తోంది. ఈ సినిమాని హిట్ చేయాల్సిందే అనే తాపత్రయంతో పబ్లిసిటీ డోసు పెంచింది చిత్రబృందం. అందుకే టీవీ ఛానళ్ల చుట్టూ తిరుగుతూ లైవ్ షోలు పెడుతూ తెగ సందడి చేస్తోంది చిత్రబృందం. ఓ లైవ్ షోలో శిరీష్‌కు నరకం చూపించారు ఆడియన్స్. రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఓ కాలర్ ''మీ నటనలో ఎలాంటి మార్పూ లేదు..'' అని మొహం మీద చెప్పేశాడు. ఇంకో కాలర్ ''మెగా హీరోల మధ్య గొడవలున్నాయట'' అని అడిగేశాడట. అంతే కాదు.. ''మీ అన్నయ్య బన్నీని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి'' అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఈ ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలీక బిక్క మొహం వేశాడు శిరీష్. దెబ్బకి లైవ్ షోల మీద విరక్తి వచ్చి ఉంటుంది బాబు గారికి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



