కొండా సురేఖకి ఎన్టీఆర్ మాస్ వార్నింగ్
on Oct 2, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)కేవలం సినిమాలోనే దేవర(devara)కాదు రియల్ లైఫ్ లో కూడా దేవర అని నిరూపించాడు. ఇటీవల ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున(nagarjuna)ఫ్యామిలీ పై, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత పై తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి ఎన్టీఆర్ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు.
కొండా సురేఖ(kondasurekha)గారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట.ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు అని ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలందరూ కూడా తన సినిమా వాళ్ళకి అండగా ఉన్నందుకు ఎన్టీఆర్ ని మెచ్చుకుంటున్నారు.ఇక మొన్న సెప్టెంబర్ 27 న విడుదలైన ఎన్టీఆర్ దేవర వరల్డ్ వైడ్ గా రికార్డు కలెక్షన్స్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.
Also Read