కొండా సురేఖపై అక్కినేని అమల ఫైర్..ఢిల్లీకి ఫిర్యాదు నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ
on Oct 2, 2024

అక్కినేని కుటుంబంపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(konda surekha)చేసిన కామెంట్స్ తో ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యింది.తమ రాజకీయ స్వార్ధం కోసం ప్రజలని తమ నటనతో అలరిస్తూ వస్తున్న సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలనే కించపరిచేలా మాట్లాడతారా అని అక్కినేని అభిమానులే కాకుండా ప్రజలు కూడా బాధపడుతున్నారు.
ఇప్పుడు ఈ విషయంపై అక్కినేని నాగార్జున(nagarjuna)సతీమణి అమల(amala)తన ఆవేదనని వ్యక్తం చేసింది.కొండా సురేఖ చేసినవన్నీ అసత్య ఆరోపణలు.దయచేసి రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు.నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.అసలు రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే, ఈ దేశం ఏమైపోతుంది. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని అమల డిమాండ్ చేశారు.

అమల కూడా హీరోయిన్ గా చాలా సినిమాల్లో చేసిన విషయం అందరకి తెలిసిందే. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోల పక్కన చేసి మంచి నటిగా గుర్తింపు పొందింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



