కొండా సురేఖ కామెంట్స్ పై సమంత స్ట్రాంగ్ రియాక్షన్...
on Oct 2, 2024
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున (Nagarjuna) తీవ్రంగా ఖండించారు. తక్షణమే కొండా సురేష్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా సమంత కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు.
"స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి... చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, నా ప్రయాణం పట్ల నేను గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉంటుందని, మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా మరియు గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాల్లోకి లాగకండి. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను." అని సమంత రాసుకొచ్చారు.