'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ లో మార్పు లేదు!
on Jan 4, 2022
.webp)
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'భీమ్లా నాయక్'. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కావాల్సి ఉంది. అయితే జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్', జనవరి 14 న 'రాధేశ్యామ్' ఇలా రెండు పాన్ ఇండియా సినిమాలు ఉండటంతో.. థియేటర్స్ కొరత ఏర్పడకూడదన్న భావనతో ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ తో 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 కి వాయిదా పడింది.
అయితే కరోనా విజృంభణ మళ్ళీ ప్రారంభమవడంతో పలు రాష్ట్రాలలో థియేటర్స్ మూత పడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుసున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదా పడింది. దీంతో ఆర్ఆర్ఆర్ కోసం వెనక్కి వెళ్లిన భీమ్లా నాయక్ మళ్ళీ ముందుకొచ్చే అవకాశముందని, జనవరి 12 నే భీమ్లా నాయక్ విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని, ఫిబ్రవరి 25 నే భీమ్లా నాయక్ విడుదలవుతుందని తెలుస్తోంది.
భీమ్లా నాయక్ కి తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తోంది. భీమ్లా నాయక్ వాయిదా పడటంతో తమన్ ఇన్నిరోజులు ఇతర ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడట. తమన్ ఇప్పటికిప్పుడు భీమ్లా నాయక్ కోసం పనిచేసినా వారం రోజుల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయడం అనేది అసాధ్యం అంటున్నారు. అలాగే కొంత ప్యాచ్ వర్క్ కూడా పెండింగ్ ఉందని తెలుస్తోంది. అందుకే కాస్త ఆలస్యమైనా కరెక్ట్ అవుట్ పుట్ తో రావాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 25 నే సినిమాని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



