ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్‌తో ప్రేమలో విక్రమ్ కొడుకు ధ్రువ్?!
on Jan 4, 2022

'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ'తో హీరోగా పరిచయమై ఆకట్టుకున్నాడు ధ్రువ్ విక్రమ్. సీనియర్ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడైన ధ్రువ్ తన ఫస్ట్ ఫిల్మ్ హీరోయిన్ బనిత సంధుతో ప్రేమలో ఉన్నాడా? అవుననే అనిపిస్తోంది అతను స్వయంగా షేర్ చేసిన ఒక వీడియో చూస్తే. ఆ ఇద్దరూ కొత్త సంవత్సరాన్ని కలిసి దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ధ్రువ్ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. అది చూసి ఆ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారా?.. అని ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు.
బనితతో జరుపుకున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ధ్రువ్ షేర్ చేశాడు. ఒక వీడియోలో, దుబాయ్‌లోని ఫేమస్ బుర్జ్ ఖలీఫాను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది బనిత. మరో వీడియోలో 2022కు స్వాగతం చెప్తూ ధ్రువ్, బనిత డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.
ఈ వీడియోలు వైరల్ కావడంతో, చూడముచ్చటగా కనిపిస్తోన్న ఆ జంట డేటింగ్‌లో ఉన్నారా? అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 2019లో వచ్చిన 'ఆదిత్య వర్మ' మూవీకి ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ధ్రువ్, బనిత కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందని అంతా చెప్పుకున్నారు.
ధ్రువ్ ప్రస్తుతం తండ్రి విక్రమ్‌తో కలిసి కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో 'మహాన్' మూవీ చేస్తున్నాడు. లేటెస్ట్ రిపోర్టులు ప్రకారం ఆ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నది. త్వరలో దీనికి సంబంధించిన అఫిషియల్ స్టేట్‌మెంట్ రానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



