నిత్యకు షాకిచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..!
on Aug 12, 2016

ప్రజంట్ జనరేషన్‌లో అందంలో..అభినయంలో నిత్యమీనన్ ముందు వరుసలో ఉంటారు. ఆఫర్ వచ్చింది కదా.. అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా తన మనసుకు నచ్చిన సినిమా చేస్తూ..దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న జనతా గ్యారేజ్‌లో సమంతతో కలిసి స్క్నీన్ షేర్ చేసుకుంది నిత్య. కెరీర్‌లోనే తొలిసారిగా ఎన్టీఆర్ లాంటి అగ్రకథానాయకుడితో ఆడి పాడే ఛాన్స్ రావడంతో నిత్య ఎగిరిగంతేసింది.
ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడుతో కంప్లిట్ చేసుకుని ఇవాళ ఆడియో రిలీజ్ వేడుకను జరుపుకుంది. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఆడియో లాంచ్‌కు వేదిక కావడంతో నిత్య అక్కడికి చేరుకుంది. కారులోంచి కాలుబయట పెట్టిందో లేదో..అభిమాన సందోహన్ని చూసి అవాక్కయ్యింది. వాళ్ల బారి నుంచి తప్పుకుని ఆడిటోరియంలోకి అడుగుపెట్టగానే అది సునామీ అయ్యింది. చివరకు నిత్య వేదిక ఎక్కి మైక్ అందుకోగానే ఒకటే ఈలలు, కేరింతలు మాట్లాడదామంటే నోటి వెంట మాట రావడం లేదు. అప్పటికి అర్థమయ్యింది ఇది ఎన్టీఆర్ సినిమా అని. మొత్తానికి జూనియర్ ఫ్యాన్స్ జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో చూసేసరికి నిత్యమీనన్ షాక్‌కు గురైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



