హనీమూన్‌కి నిఖిల్ దగ్గర టైమ్ లేదట
on Mar 11, 2020
నిఖిల్ పెళ్లికి గట్టిగా నెల రోజుల టైమ్ కూడా లేదు. ఏప్రిల్ 16న పల్లవి శర్మతో ఏడు అడుగులు వేయడానికి నిఖిల్ రెడీ అవుతున్నాడు. అన్నట్టు... మరో టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి కూడా అదే రోజు. ప్రస్తుతం పెళ్లి పనులు జోరుగా, హుషారుగా జరుగుతున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉంటే, నిఖిల్ మాత్రం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. తన దృష్టి అంతా పూర్తిగా సినిమాపై పెట్టానని చెబుతున్నాడు. రీసెంట్ గా 'కార్తికేయ' సీక్వెల్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు నిఖిల్. అందులో బిజీగా ఉండడంతో పెళ్లి పనులకు తన దగ్గర టైమ్ లేదని చెబుతున్నాడు. అంతే కాదు, హనీమూన్‌కి నిఖిల్ దగ్గర టైమ్ లేదట! 'కార్తికేయ 2' షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే హనీమూన్ పెట్టుకుంటానని స్పష్టం చేశాడు.
"దసరాకు 'కార్తికేయ 2' సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అలా చేయాలంటే నెక్స్ట్ రెండు మూడు నెలలు బిజీ బిజీగా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. పెళ్లికి వారం రోజులు మాత్రమే సెలవు తీసుకుంటున్నా. దురదృష్టవశాత్తూ, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే హనీమూన్ ఉంటుంది" అని నిఖిల్ తెలిపాడు.
'కార్తికేయ'లో స్వాతి హీరోయిన్. ఈ సీక్వెల్ లో కూడా ఆమె ఉంటుంది. అలాగే, మరో హీరోయిన్ కూడా ఉంటుందని నిఖిల్ చెప్పాడు. ఆ హీరోయిన్ ఎవరో త్వరలో చెబుతారట.