మెగా సినిమాల్లో కన్నడ నటులు
on Mar 11, 2020
మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని, మెగా ఫ్యామిలీలో మిగతా హీరోలకూ కన్నడలో మంచి మార్కెట్ ఉంది. బెంగళూరులో మెగా ఫ్యామిలీ సినిమాలకు కలెక్షన్స్ బావుంటాయి. అక్కడ తమ మార్కెట్ మరింత పెంచుకునే విధంగా, కన్నడ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే విధంగా మెగా హీరోలు అడుగులు వేస్తున్నారు. కన్నడ నటులను తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక విలన్. మరో విలన్‌గా కన్నడ నటుడు రాజ్ దీపక్ శెట్టిని తీసుకున్నారు. మరో మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో నటిస్తున్న సినిమాలోనూ కన్నడ నటుడిని ప్రధాన పాత్రకు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. తెలుగులో అతడికి మంచి ఇమేజ్ ఉంది. వరుణ్ తేజ్ సినిమాలోని ప్రధాన పాత్రలో నటించమని ఉపేంద్రని సంప్రదించారట. గతంలో అల్లు అర్జున్ 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర విలన్ రోల్ చేశారు. ఈసారి ఏమంటారో చూడాలి. ప్రస్తుతం కన్నడలో హీరోగా చేస్తున్న సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు.