ఒక్క సీన్లో కనిపిస్తే చాలనుకున్నాడు... కట్ చేస్తే స్టార్ అయ్యాడు
on Jun 7, 2017
ఎంత టాలెంట్ ఉన్నా లక్ కలిసొస్తేనే జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొందరికి విపరీతమయిన టాలెంట్ ఉంటుంది... కానీ అదృష్టం కలిసిరాక అక్కడే ఉండిపోతారు. ఇంకొందరు, అంది వచ్చిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని అందనంత ఎత్తుకి ఎదుగుతారు. అసలు విషయానికి వస్తే, యంగ్ హీరోల్లో వరుస విజయాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నిఖిల్ అసలు ఏ రోజు కూడా స్టార్ అవుతానని అనుకోలేదట. సినిమాలపై పిచ్చితో ఒక్క సారి స్క్రీన్ పైన కనిపిస్తే చాలు అనుకునేవాడంట. అలాంటిది ఇప్పుడు సక్సెస్ కి కేర్ అఫ్ అడ్రస్ గా మారాడు. హ్యాపీ డేస్ కి శేఖర్ కమ్ముల కొత్త వాళ్ళని తీసుకుంటున్నారని తెలిసి నిఖిల్ ఆడిషన్ కి వెళ్ళాడట.
ఈ యంగ్ హీరో ఎనర్జీ లెవెల్స్ కి ముగ్ధుడైన డైరెక్టర్ హ్యాపీ డేస్ లో సెకండ్ హీరో రోల్ కి ఒకే చేసాడు. ఆ తర్వాత పరశురామ్ తీసిన యువత సినిమాతో తాను మాస్ సినిమాలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. స్వామి రా రా తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన నిఖిల్, ప్రస్తుతం యంగ్ హీరోల్లో టాప్ ప్లేసులో ఉన్నాడు. ఈ మధ్య వచ్చిన... తక్కువ బడ్జెట్లో తీసిన కేశవ కమర్షియల్ హిట్ గా నిలిచింది. కొత్త లేదా ప్రయోగాత్మక చిత్రాలు తీయాలి అనుకునే యువ దర్శకులకి నిఖిల్ దేవుడిలా కనిపిస్తున్నాడు. అందరిలా ఫార్ములా సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తెలుగులో చేస్తున్న ప్రతి సినిమాకి ఒక మెట్టు పైకి ఎదుగుతున్నాడు.
Also Read