అల్లు అర్జున్ ప్లేస్ లో నేనే ఉంటేనా అంటు నీహారిక అదిరిపోయే జవాబు
on Jul 31, 2024
మెగా డాటర్ నిహారిక(niharika)గురించి తెలియని సినీ ప్రేమికుడు లేడు. హీరోయిన్ గానే కాకుండా మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలని కూడా పోషిస్తూ నటిగా ప్రూఫ్ చేసుకుంటుంది.ఇంకో పక్క ప్రొడ్యూసర్ గాను తన సత్తా చాటుతుంది. లేటెస్ట్ గా అల్లు అర్జున్(allu arjun)విషయంలో కొన్ని కామెంట్స్ చేసింది. ఇప్పుడు అవి వైరల్ గా నిలిచాయి.
నీహారిక తాజాగా నిర్మిస్తున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు. అగస్ట్ 9 న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. సదరు యాంకర్ నీహారిక తో మొన్న ఎలక్షన్స్ లో అల్లు అర్జున్ గారు వేరే పార్టీ అభ్యర్ధికి సపోర్ట్ గా వెళ్లారు. అప్పుడు మీ ఫ్యామిలీ లో డిసప్పాయింట్ ఏమైనా వచ్చిందా అని అడిగాడు. ఇంట్లో అయితే ఆ టాపిక్ రాలేదు. కానీ ఎంత ఫ్యామిలీ అయినా ఎవరి ఇండిడ్యువాలిటీ వారికి ఉంటుంది కదా అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ యాంకర్ మాట్లాడుతు మీరు చెప్పేది నిజమే కావచ్చు.
కానీ ఫ్యామిలీ లోని పవన్ కళ్యాణ్(pawan kalyan)రాజకీయంగా చాలా కష్టపడుతుంటే అల్లు అర్జున్ ఆ విధంగా చెయ్యడంతో డిసప్పాయింట్ అవుతారా కదా అని అనడమే కాకుండా ఒక వేళ మీరే అల్లు అర్జున్ ప్లేస్ లో ఉంటే ఫ్రెండా, ఫ్యామిలీ నా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా ఫ్యామిలీ కే అని రిప్లై ఇచ్చింది. అలాగే నాగ బాబు గారు దగ్గర ఎప్పుడు కూడా రకరకాల నీతి వ్యాఖ్యలు స్టోరేజ్ లో ఉంటాయని కూడా చెప్పుకొచ్చింది.