మీడియాపై రాజ్ తరుణ్ ఫైర్!
on Jul 31, 2024
కొద్దిరోజులుగా హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) పేరు మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఆయన మాజీ ప్రేయసి లావణ్య వివాదమే అందుకు కారణం. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. లావణ్యతో తాను ఎప్పటినుంచో దూరంగా ఉంటున్నానని, దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తోందని రాజ్ తరుణ్ అన్నాడు. ఇలా ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. పలు ఆడియో క్లిప్ లు బయటకు రావడంతో రచ్చ రచ్చ అయింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. అయితే తాజాగా ఈ విషయంలో మీడియాపై రాజ్ తరుణ్ అసహనం వ్యక్తంచేశాడు.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'తిరగబడరా సామి' (Tiragabadara Saami) మూవీ ఆగష్టు 2న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా నుంచి.. సినిమా కంటే కూడా లావణ్య వివాదం గురించే ఎక్కువ ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో రాజ్ తరుణ్ అసహనం వ్యక్తం చేశాడు. సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అడగాలని అన్నాడు. అయితే ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయమని, దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరముందని ఒక రిపోర్టర్ అనడంతో.. ఈ వివాదాన్ని తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని, తన దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయని రాజ్ తరుణ్ చెప్పాడు. ఈ క్రమంలో లావణ్య వివాదానికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు ఎదురుకావడంతో.. రాజ్ తరుణ్ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఒకానొక సమయంలో ఒక రిపోర్టర్ పై అరిచాడు కూడా. ఆ తర్వాత మళ్ళీ సారీ చెప్పి.. మీడియా పర్సన్స్ తో తనకి దాదాపు పదేళ్ల నుంచి అనుబంధముందని, కొద్దిరోజులుగా ఈ ఇష్యూ కారణంగా ఎంతో బాధను అనుభవించానని, దయచేసి అందరూ అర్థంచేసుకోవాలని రాజ్ తరుణ్ కోరాడు.
Also Read