ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి క్రేజీ అప్డేట్!
on Jul 31, 2024
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' (Devara) సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత 'వార్-2', 'దేవర-2', ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. వీటి తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది.
'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యవ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేసే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో, వరుసగా స్టార్ డైరెక్టర్లతో భారీ పాన్ ఇండియా సినిమాలు చేసున్న ఎన్టీఆర్.. శౌర్యవ్ లాంటి యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయనుండటం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో సంచలన న్యూస్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని రెండు భాగాలుగా రూపొందించాలని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భావిస్తోందట.
అయితే సన్నిహిత వర్గాలు మాత్రం శౌర్యవ్ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నాయి. శౌర్యవ్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చి.. ఎన్టీఆర్ డెవలప్ చేయమని చెప్పాడట. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే.. ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ డెసిషన్ తీసుకోనున్నాడని సమాచారం. ఒకవేళ ఫైనల్ స్క్రిప్ట్ నచ్చి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. ఇది ఎవరూ ఊహించని కాంబో అవుతుంది.
Also Read