నిధిలో ఎన్ని నృత్య కళలో...
on Apr 29, 2020

రవివర్మ కుంచె నుండి జాలువారిన అద్భుత శిల్పంలా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో పాటల్లో నిధి అగర్వాల్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ చూపించారు. విశేషం ఏంటంటే... నిధి అగర్వాల్ కూడా కుంచె పట్టుకొని చిత్రాలు గీస్తున్నారు. ఆమె పెయింటింగ్స్ వేసే ఆర్టిస్ట్. 'ఇస్మార్ట్ శంకర్'లో మరో హీరోయిన్ నభా నటేష్ కూడా ఆర్టిస్ట్. నిధిలో ఈ టాలెంట్ పక్కన పెడితే... ప్రస్తుతం ఆమె ఆన్‌లైన్‌లో యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటున్నారు. ఎందుకు? అని అడిగితే... "నేను ట్రైన్డ్ యాక్టర్ కాదు. అందుకని, ఫిల్మ్ మేకింగ్‌లో టెక్నికల్ అంశాలు తెలుసుకోవడానికి ఇదే మంచి టైమ్ అనుకుంటున్నాను" అని చెప్పారు. ఇంకో ఆసక్తికరమైన అంశాన్ని నిధి అగర్వాల్ వెల్లడించారు. ఆమెకు పలు రకాల నృత్య కళలలో ప్రావీణ్యం ఉంది.
"నేను ఎనిమిదేళ్లు బ్యాలెట్ డాన్స్ నేర్చుకున్నాను. మూడు నెలలు కథక్ నేర్చుకున్నాను. హిందీలో కథానాయికగా పరిచయమైన 'మున్నా మైఖేల్' కోసం హిప్ హాప్ డాన్స్ ఫార్మ్ నేర్చుకున్నా. నాకు బెల్లీ డాన్సింగ్, టాప్, జాజ్, దేశీ స్టెప్స్ కూడా వచ్చు. డాన్స్ చేస్తే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది" అని నిధి అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో హ్యాపీగా ఉండాలంటే ప్రజలు డాన్స్ చేయమని నిధి అగర్వాల్ సలహా ఇస్తున్నారు. ఒక రూమ్‌లో లాక్ అయిపోయి మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయాలట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



