ఇర్ఫాన్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్రపరిశ్రమ!
on Apr 29, 2020

ఇక 2006లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన సైనికుడు మూవీలో ఇర్ఫాన్ ఖాన్ నటించారు. మహేష్ బాబు, త్రిష, ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. అంతకు ముందే మహేశ్ బాబు హీరోగా సంచలనాత్మకమైన విజయం సాధించిన పోకిరి చిత్రం వెంటనే ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యింది కాని బాక్సాఫీసు వద్ద పూర్తిగా విఫలమయ్యంది.
తుఫాను బాధితులకు ఏడు కోట్లు విరాళంగా ఇస్తున్నానని ఆ ఏరియాలో పెద్ద దాదా అయిన పప్పూయాదవ్ (ఇర్ఫాన్ ఖాన్) గా నటించాడు. హీరోయిన్ త్రిషను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని తెగ తాపత్రయ పడతాడు. ఈ నేపథ్యంలో సాగే సినిమా వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో మహేష్ బాబు తో పాటు తెలుగు నటులతో మంచి అనుబంధం పెంచుకున్నారు ఇర్ఫాన్ ఖాన్. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూయడం తెలుగు ఇండస్ట్రీ ప్రగాఢసంతాపాన్ని తెలియజేస్తుంది. తాజాగా బోనికపూర్ ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. సహజ నటుడు మంచి మిత్రుడు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తి చేశాడు.
లాక్ డౌన్ వలన ఆయన ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో ట్విట్టర్ ద్వారానే ఇర్ఫాన్‌కి నివాళులు అర్పించారు. అమితాబ్, తాప్సీ, అనుపమ్ ఖేర్,పరేష్ రావల్, లతా మంగేష్కర్,అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు
ఇర్ఫాన్ మరణవార్త విన్నాను. ఈ వార్త నన్ను ఎంతో కలచివేసింది. చాలా విచారకరమైన వార్త. ఎంతో అద్భుతమైన ప్రతిభ.. దయాహృదయం ఉన్నసహా నటుడు.. సినిమా ప్రపంచానికి ఎంతో సేవ చేసిన నటుడు..మనల్ని చాలా త్వరగా వదిలి వెళ్లారు. మీ ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను - అమితాబ్ బచ్చన్
ఇర్ఫాన్ అకాల మరణం వార్త నా హృదయాన్ని కలిచి వేసింది. ఇండియన్ సినిమాకి ఆయన మరణం తీరని లోటు. ఇర్ఫాన్ పిల్లలు, కుమారులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను - అజయ్ దేవగణ్
భయంకరమైన వార్త.. ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మా కాలం నాటి అద్భుతమైన నటులలో ఆయన ఒకరు. ఈ కష్ట సమయంలో ఇర్ఫాన్ కుటుంబానికి ధైర్యం అందించాలని దేవుడిని కోరుతున్నాను - అక్షయ్ కుమార్
మీతో పని చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మీరు సినిమాల రూపంలో ఎప్పటికీ మా హృదయాలలో నిలిచిపోతారు. నా ప్రార్థనలు మీ కుటుంబంతో తప్పక ఉంటాయి. - హుమా ఖురేషీ
ఈ రోజు స్వర్గం ఎంతో అదృష్టంగా భావిస్తుంది. ఇర్ఫాన్ సర్ మరణ వార్త నాకు నమ్మశక్యంగా లేదు. దీనిపై ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను - సోనాల్ చౌహాన్
చాలా ప్రతిభావంతులైన నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఆయన మరణ వార్త విన్నప్పుడు నాకు చాలా బాధగా ఉంది. ఆయనకు నా వినయపూర్వకమైన నివాళి అర్పిస్తున్నాను. - లతా మంగేష్కర్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



