దిల్` రాజు.. సంక్రాంతి `డబుల్ హ్యాట్రిక్` ప్లాన్!
on Jan 3, 2022

స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజుకి అచ్చొచ్చిన సీజన్స్ లో సంక్రాంతి ఒకటి. ఇంకా చెప్పాలంటే.. ముగ్గుల పండక్కి పలకరించిన రాజు చిత్రాలేవీ నిరాశపరచలేదు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013)తో ఈ సీజన్ లో తొలిసారిగా సందడి చేసిన `దిల్` రాజు.. ఆపై `ఎవడు` (2014), `శతమానం భవతి` (2017), `ఎఫ్ 2` (2019), `సరిలేరు నీకెవ్వరు` (2020) (సహ నిర్మాణం) వంటి విజయాలు చూశారు. ఓవరాల్ గా.. ఇప్పటివరకు సంక్రాంతి సీజన్ లో `దిల్` రాజు ఖాతాలో ఐదు విజయాలు ఉన్నాయన్నమాట.
Also Read:రవితేజ, ధనుష్ చిత్రాలతో.. మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడా!
కట్ చేస్తే.. 2022 సంక్రాంతికి మరో సినిమాతో పలకరించేందుకు సిద్ధమయ్యారు రాజు. ఆ చిత్రమే.. `రౌడీ బాయ్స్`. తన సోదరుడి తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్ నాయికగా కనిపించనుంది. `హుషారు` ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని.. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు రాజు. మరి.. అపజయమంటూ ఎరుగని ముగ్గుల పండగ సీజన్ లో.. రాజు సంక్రాంతి `డబుల్ హ్యాట్రిక్` కొడతారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



