రామాయణం త్రివిక్రమ్ ది అయ్యేనా!
on Apr 4, 2024
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ట్ ప్రాజక్ట్స్ లో రామాయణం (Ramayan) మూవీ కూడా ఒకటి. పైగా రాముడు భారతీయుల ఆరాధ్య దైవం కూడా కావడంతో రామాయణం మీద కొంచం ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. దీంతో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రణబీర్ రామాయణం మీద అందరి చూపులు పడ్డాయి. ఈ నేపథ్యంలో వస్తున్న ఒక న్యూస్ వైరల్ గా మారింది.
హిందీ చిత్ర సీమలోనే కనివిని ఎరుగని హై బడ్జట్ తో రామాయణం తెరకెక్కుతుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ కి సంబంధించి ఒక న్యూస్ చక్కెర్లు కొడుతుంది. మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(trivikram srinivas) రామాయణం కి డైలాగ్స్ రాస్తున్నాడనే వార్త సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది.ఈ న్యూస్ చూసిన వాళ్ళందరు అది నిజమవ్వాలని కోరుకుంటున్నారు. డైలాగ్ లకి స్టార్ డమ్ తెచ్చిన త్రివిక్రమ్ రామాయణం కి ఏ విధంగా రాస్తాడనే క్యూరియాసిటీ అందరిలోను ఉంది.
ఇక ఈ నెల ఏప్రిల్ 2న నుంచే రామాయణం షూటింగ్ ప్రారంభం అయిందని అంటున్నారు. కాకపోతే బాలనటులు కి సంబంధించిన షూట్ ని చేస్తున్నారని తెలుస్తుంది.ప్రధాన పాత్రధారులైన రణబీర్ (ranbir singh) యష్ (yash) సాయి పల్లవి( sai pallavi ) ఇంకా షూటింగ్ కి హాజరవ్వలేదని తెలుస్తుంది.నితీష్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి సీతగా నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో యష్ నటించబోతున్నారు.లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటించనుండగా సన్నీడియోల్ హనుమంతుడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది
Also Read