Home

»

Latest News

‘జితేందర్‌ రెడ్డి’ మూవీ గ్లింప్స్‌ రిలీజ్‌

Apr 03, 2024

ముదుగంటి క్రియేషన్స్‌ పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్‌ వర్రె లీడ్‌ రోల్‌ లో నటించిన సినిమా జితేందర్‌ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ రిలీజ్‌ వేడుక చాలా ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్మాత ముదుగంటి రవీందర్‌ రెడ్డి గారు మాట్లాడుతూ : చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటి తెలుసుకోవాల్సిన ఒక చరిత్ర జితేందర్‌ రెడ్డి జీవితం. ఈ సినిమాలో ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేసిన విరించి గారు జితేందర్‌ రెడ్డి గురించి తెలుసుకొని ఈ సినిమా నేను డైరెక్ట్‌ చేస్తానని ముందుకు రావడం చాలా ఆనందం అనిపించింది. అదేవిధంగా రాకేష్‌ ఈ సినిమాతో జితేందర్‌ రెడ్డిగా ఆ పాత్రలో జీవించారు. ఈ సినిమా తర్వాత జితేందర్‌ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకుంటారు అంత అద్భుతంగా నటించారు. ఎన్నో అవార్డులు తీసుకున్న డిఓపి జ్ఞాన శేఖర్‌ గారు ఈ సినిమాకు పనిచేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి జితేందర్‌ రెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది ఆయన చేసిన సేవ గుర్తుండిపోతుంది. భగత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో జితేందర్‌ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అలాంటిదే. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో రాకేష్‌ వర్రె మాట్లాడుతూ : క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా మొదలై మిర్చి బాహుబలి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యి ఎవరికీ చెప్పొద్దు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. విరించి వర్మ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాలను పక్కనపెట్టి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ప్రొడ్యూసర్‌ రవీందర్‌ రెడ్డి గారు తన అన్న జితేందర్‌ రెడ్డి కథని ప్రజలకు చెప్పాలనుకునే తాపత్రయం బాగా నచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని మంచి సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ : శేఖర్‌ గారు నాకు కాల్‌ చేసి ఒక కథ ఉంది డైరెక్ట్‌ చేయాలి అని చెప్పారు. కథ వినడానికి వెళ్ళినప్పుడు ఒక బుక్‌ ఇచ్చి చదువుకోమన్నారు. కథ చదివిన తర్వాత ఇంత పవర్ఫుల్‌ క్యారెక్టర్‌ నేనే డైరెక్ట్‌ చేయాలి అనుకున్నాను. అదేవిధంగా జితేందర్‌ రెడ్డి గారి గురించి తెలుసుకోవడం కోసం ఆయన విలేజ్‌ కు వెళ్లి ఆయన స్నేహితులతో అక్కడున్న ప్రజలతో ఇంట్రాక్ట్‌ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుని ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాను. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మంచి సక్సెస్‌ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com