చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్, టీవీ 5 మూర్తిల విధ్వంసం
on Mar 29, 2024
నారా రోహిత్ హీరోగా 2014 లో వచ్చిన మూవీ ప్రతినిధి. మంచోడు శ్రీను అనే ఒక సామాన్యుడి క్యారక్టర్ లో సమకాలీన రాజకీయ వ్యవస్థపై రోహిత్ సంధించిన బాణాలు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసాయి. మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది. మళ్ళీ ఇప్పుడు ప్రతినిధి 2 తో రాబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని ఒక ఊపు ఊపుతుంది.
కొద్దీ సేపటి క్రితమే ప్రతినిధి 2 టీజర్ రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయిన ఆ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. ఒక పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో రోహిత్ కనిపించాడు. ఒక నిమిషం ముప్పై మూడు సెకన్లు ఉన్న ఆ టీజర్ లో రోహిత్ చెప్పే ఒక్కో డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. పోరాట సన్నివేశాలు కూడా ఒక లెవల్లో ఉన్నాయి. నిర్దావ్యవస్థలో ఉన్న సమాజాన్ని రోహిత్ తన జర్నలిజం ద్వారా మేల్కొనేలా చేస్తున్నాడనే విషయం అర్ధం అవుతుంది. అలాగే అవినీతి రాజకీయనాయకుల భరతం పట్టబోతుందని కూడా తెలుస్తుంది. టోటల్ గా చెప్పాలంటే మూవీ పక్కా హిట్ అనే సంకేతాలని టీజర్ ఇచ్చింది. చివర్లో ఇకనైనా మారండి లేదా దేశం విడిచి వెళ్ళండి. అది కుదరకపోతే చచ్చిపోండి అని రోహిత్ చెప్పడం రియల్లీ సూపర్.
అజయ్ ఘోష్, సచిన్ ఖేడ్కర్, పృథ్వీ, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి నటులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ టీవీ 5 మూర్తి దర్శకత్వంలో ప్రతినిధి 2 రూపొందటం విశేషం. రోహిత్ చాలా సంవత్సరాల తర్వాత కమ్ బ్యాక్ ఇస్తుండటం కూడా ఆసక్తిని నెలకొల్పుతుంది.తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు 22 చిత్రాలకి పైగానే చేసాడు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కుమార్ బత్తుల రాజా, తోట ఆంజనేయులు,బొల్లినేని సురేంద్రనాథ్ లు నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. శ్రీరామ నవమి కానుకగా విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
Also Read