నితిన్ దిల్ కి విజయ్ ఫ్యామిలీ స్టార్ కి ఉన్న లింకు బయటపడింది
on Mar 29, 2024
తెలుగు సినిమా పరిశ్రమని ఏలే వాళ్ళల్లో మొత్తం 24 క్రాఫ్ట్స్ కి చెందిన వాళ్ళు ఉంటారు. హీరో, హీరోయిన్, క్యారక్టర్ ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్, ఎడిటర్ ఇలా అందరు ఉంటారు. వీళ్లతో పాటు సెంటిమెంట్ కూడ తెలుగు సినిమాని ఏలుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఎక్కువ సార్లు వర్క్అవుట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఒక బడా నిర్మాత చెప్పిన విషయంతో మరో సారి సెంటిమెంట్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
దిల్ రాజు(dil raju) ఈయనకి తెలుగు సినిమా పరిశ్రమతో ఉన్న అనుబంధం మూడు దశాబ్దాలపైనే. ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎన్నో హిట్ చిత్రాలని ప్రేక్షకులకి అందిస్తూనే ఉన్నారు. సినిమాని విపరీతంగా ప్రేమించే ఈయనకి విజయాల శాతం కూడా చాలా ఎక్కువ.లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ (family star) మూవీతో రాబోతున్నాడు. ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది. తాజాగా ఆ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అందులో ఆయన మాట్లాడుతు తనని దిల్ రాజుగా మార్చిన దిల్ సినిమా కూడా ఏప్రిల్ 5 న రిలీజ్ అయిందని చెప్పాడు. దీన్ని బట్టి ఆయన సెంటిమెంట్ ని బాగా నమ్ముతున్నాడని తెలుస్తుంది.
నితిన్ హీరోగా 2003 లో వచ్చిన దిల్ (dil) మూవీ భారీ విజయాన్నే అందుకుంది. పైగా దిల్ రాజు కి అదే ఫస్ట్ మూవీ కూడా. అక్కడ నుంచి ఆయన సినీ ప్రస్థానం ఏ స్థాయిలో ముందుకు వెళ్తు ఉందో చూస్తూనే ఉన్నాం. మరి ఆయన నమ్మకాన్ని ఫ్యామిలీ స్టార్ నిలబెడతాడో లేదో చూడాలి.
విజయ్ దేవరకొండ(vijay devarakonda) హీరోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్( family star) లో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తుంది. మరో స్టార్ హీరోయిన్ రష్మిక (rashmika) క్యామియో రోల్ లో కనిపించబోతుంది. పరశురామ్ (parasuram) దర్శకత్వాన్ని వహించగా గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు. ఇంతకు ముందు విజయ్, గోపి, పరశురామ్ కాంబోలో గీత గోవిందం వచ్చి ఎంతగా సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిందే. జగపతిబాబు, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగు తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.