ప్రభాస్ ఫ్యాన్స్ డల్.. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా
on Mar 29, 2024
ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ (prabhas) కి ఉన్న ఛరిష్మానే వేరు. తెలుగులోనే కాకుండా వేరే భాషల్లోను ఆయనకీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గూగుల్ లో ఆయన అప్ కమింగ్ మూవీస్ గురించి కొన్ని లక్షల మంది అభిమానులు నిత్యం చెక్ చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ని కొద్దిగా నిరుత్సాహపరుస్తుంది.
ప్రభాస్ మరికొన్ని రోజుల్లో కల్కి (kalki 2898 ad) కి గుమ్మడికాయ కొట్టబోతున్నాడు. మే 9 న ఆ మూవీ విడుదల కాబోతుంది. మరి ఎలక్షన్స్ నేపథ్యంలో డేట్ మారుతుందేమో చూడాలి. ఇక ఆ తర్వాత లైన్ లో ఉన్న ప్రాజక్ట్ రాజా సాబ్(raja saab) మారుతి (maruthi) దర్శకత్వంలో వస్తున్న ఆ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతుంది. ఆ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ (sandeep reddy vanga) దర్శకత్వంలో స్పిరిట్ (spirit) చేస్తున్నాడు. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజా అప్ డేట్ ప్రకారం డిసెంబర్ లో సెట్స్ మీదకి వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడని అందుకే లేట్ అవుతుందని అంటున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి, యానిమల్ తో సందీప్ టాప్ డైరెక్టుల లిస్ట్ లో చేరిపోయాడు. హీరోని కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సందీప్ తర్వాతే ఎవరైనా అనే క్రేజ్ ని కూడా సంపాదించాడు. పైగా ఇప్పుడు సందీప్ పక్కా పాన్ ఇండియా డైరెక్టర్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ స్పిరిట్ పై భారీ అంచానాలనే పెట్టుకున్నారు.ఎప్పుడెప్పుడు మూవీ సెట్స్ మీదకి వెళ్లి ఎప్పుడెప్పుడు షూటింగ్ ని పూర్తి చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలని నిర్మించిన టి సిరీస్ సంస్థ స్పిరిట్ ని నిర్మిస్తుంది. ఒక్కటి మాత్రం నిజం ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి కాంబో ఎప్పుడొచ్చినా రికార్డులు సృష్టించడం ఖాయం.
Also Read