సూపర్ స్టార్ తో 'సప్త సాగరాలు దాటి' డైరెక్టర్ సినిమా.. ఫుల్ యాక్షన్!
on Feb 3, 2024
'సప్త సాగరాలు దాటి' ఫ్రాంచైజ్ తో ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు హేమంత్ ఎం రావు. 2023లో రెండు భాగాలుగా వచ్చిన ఈ కన్నడ మూవీ తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు సమాచారం.
'గోధి బన్న సాధారణ మైకట్టు', 'కవలుదారి', 'సప్త సాగరాలు దాటి' లాంటి డిఫరెంట్ జానర్‌లు తర్వాత హేమంత్ ఎం రావు యాక్షన్ సినిమా చేయనుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
వైశాక్ ఏ గౌడ "తాను నిర్మిస్తున్న మొదటి సినిమానే శివరాజ్ కుమార్ లాంటి స్టార్ట్ తో చేయడం సంతోషంగా ఉందని. ఈ ప్రాజెక్ట్ తనపై భాధ్యతను పెంచింది" అని తెలియజేశారు.
Also Read