పూనమ్ పాండే బ్రతికే ఉంది.. ఇలా కూడా ప్రాంక్ చేస్తారా?..
on Feb 3, 2024
"నేనూ ఎన్నో మోసాలు చేశానురా కానీ ఇలాంటి మోసం ఎప్పుడూ చేయలేదు" అంటూ 'అదుర్స్' సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది పూనమ్ పాండే చేసిన పని చూస్తుంటే. బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్(గర్భాశయ క్యాన్సర్)తో గురువారం రాత్రి మృతి చెందినట్లు ఆమె సన్నిహితులు ప్రకటించారు. కేవలం 32 ఏళ్ళ వయసులో పూనమ్ మరణించింది అన్న వార్తతో అందరూ షాకయ్యారు. సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మరణ వార్త నుంచి బయటపడని వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయంలో "తూచ్.. తాను బ్రతికే ఉన్నాను" అంటూ ఇంకా బిగ్ షాక్ ఇచ్చింది పూనమ్.
తాను చనిపోలేదని తెలుపుతూ తాజాగా పూనమ్ పాండే ఓ వీడియోను విడుదల చేసింది. సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా మంది మహిళలకు తెలియదని.. దీనిపై అవగాహన కల్పించేందుకే తాను చనిపోయినట్లు ప్రచారం చేసినట్లు తెలిపింది. అలా చేయడం వల్ల సడెన్ గా చాలామంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారని పేర్కొంది.
పూనమ్ పాండే చేసిన పనికి.. అవగాహన పేరుతో ఇలాంటి ప్రాంక్ చేసినందుకు బాధపడాలో, ఆమె బ్రతికే ఉందని తెలిసి సంతోషపడాలో తెలియట్లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read