ఎట్టకేలకు 'లీడర్-2'కి ముహూర్తం కుదిరింది..!
on Feb 3, 2024
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'లీడర్' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు రానా దగ్గుబాటి. 2010 లో విడుదలైన ఈ పొలిటికల్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు.. రానా, శేఖర్ కమ్ముల కెరీర్స్ లో ఇదొక స్పెషల్ మూవీగా నిలిచింది. అలాగే టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ ఫిల్మ్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ రానుందంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. శేఖర్ కమ్ముల సైతం పలు సందర్భాల్లో 'లీడర్-2' ఉంటుందని చెప్పాడు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ కి ముహూర్తం కుదిరినట్లు సమాచారం.
ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రీసెంట్ గా కమ్ములతో మరో ప్రాజెక్ట్ ని ప్రకటించింది శ్రీ వెంకటేశ్వర సినిమాస్. కానీ హీరోతో పాటు ఇతర వివరాలేవీ రివీల్ చేయలేదు. అయితే ఇది లీడర్ సీక్వలే అనే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఇప్పటికే స్టోరీ కూడా లాక్ అయిందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ 'లీడర్-2' అనే విషయాన్ని రివీల్ చేయనున్నారని అంటున్నారు.
Also Read