'సాహో' యాక్ట్రెస్ పండంటి పాపకు తల్లయింది.. పేరును, ఫస్ట్ ఫొటోను షేర్ చేసింది!
on Nov 19, 2021

జర్మన్ మోడల్, 'సాహో' తార ఎవలీన్ శర్మ తొలిసారి ఓ పాపకు జన్మనిచ్చింది. భర్త తుషాన్ భిండీ ద్వారా నవంబర్ 12న ఆమెకు పండంటి పాప పుట్టింది. తన చిన్నారి తనయ ఫస్ట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఎవలీన్, తన పేరును కూడా వెల్లడించింది. పాపను పొత్తిళ్లలో హత్తుకొని వున్న ఫొటోను షేర్ చేసిన ఎవలీన్, "నా లైఫ్‌లో అత్యంత ప్రముఖమైన పాత్ర అవా భిండీకి తల్లి కావడం" అని రాసింది. పాప పూర్తి పేరు అవా రనియా భిండీ.
ఫొటోలో పాపను పొదివి పట్టుకొని, తలపై ముద్దుపెట్టుకుంటోంది ఎవలీన్. పాప పేరిట పేరెంట్స్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను క్రియేట్ చేశారు కూడా. దాని ప్రొఫైల్‌లో, "నా కళ్ల ద్వారా ప్రపంచం.. ఈ అకౌంట్‌ను మేనేజ్ చేసేది మమ్మీ ఎవలీన్ శర్మ" అని వుంది. ఆ అకౌంట్ ద్వారా ఫస్ట్ పిక్చర్‌ను షేర్ చేశారు. దానికి "థాంక్స్ టీమ్! ఫస్ట్ అడ్వంచర్‌కు బయలుదేరుతున్నా" అనే కాప్షన్ పెట్టారు. ఆ ఫొటోలో పాపను వాళ్ల డాడీ ఎత్తుకొని వున్నాడు.
'యే జవానీ హై దీవానీ' మూవీలో హీరోయిన్‌గా నటించిన ఎవలీన్ 'సాహో' సినిమాలో జెన్నిఫర్ క్యారెక్టర్‌లో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె, తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ వచ్చింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా 2018లో ఎవలీన్, తుషాన్ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమలో పడిన వారు, 2019 అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది మేలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ సిటీలో పెళ్లి చేసుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



