సంపాదన ముందు... పెళ్లి తర్వాత
on Apr 24, 2020

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో కమ్ యాక్టర్ నవదీప్ ఒకడు. ఇంకెన్నాళ్లు ఇలా బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని అతడిని ప్రశ్నిస్తే నవ్వేశాడు. మరికొన్ని రోజులు మాత్రమేనని అన్నాడు. అలాగని, నవదీప్ పెళ్లి ప్రయత్నాల్లో లేడు. తన జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయనీ, ఆర్ధికంగా నిలదొక్కుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని అతడు చెప్పాడు. ప్రస్తుతానికి యాక్టర్‌గా కెరీర్‌తో పెళ్లి చేసుకున్నానని చమత్కరించాడు.
ప్రస్తుతం నవదీప్ డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో హీరోగా వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. అలాగే, సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాడు. నవదీప్ నటించిన 'మస్తీ' వెబ్ సిరీస్ 'ఆహా'లో ఇటీవల విడుదలైంది. హిందీలో అతడు నటించిన మరో వెబ్ సిరీస్ విడుదలైంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'మోసగాళ్ళు'లో విలన్ రోల్ చేస్తున్న నవదీప్... తెలుగులో రెండు సినిమాలు, హిందీ, తమిళ భాషల్లో ఒక్కో సినిమా చొప్పున చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ టైమ్‌లోనూ సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడీ యాక్టర్. ఫోనులో కథలు వింటున్నాననీ, నిర్మాతలతో మాట్లాడుతున్నానని తెలిపాడు. ప్రజెంట్ జెనరేషన్‌లో ఆల్మోస్ట్ స్టార్ దర్శకులు అందరితో పని చేసిన నవదీప్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని ఉన్నట్టు చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



